Wednesday, November 18, 2015

నాన్నా

నాన్నా
 నా దరహాసమే  నీ ఉల్లాసమై  ,
నా నవ్వులే  నీ  దరహాసమై  ,
నా  అల్లరే  నీ ఆనందమై,
అడుగు  నాదై (నా)  ఆత్రుత  నీదై ,
నీ అడుగులో నా అడుగు వేసి,
నా విజయ విజయం లో తొలి అడుగు నీవై, 
నువ్వోడి  నను గెలిపించి  ,
నా విజయ నేత్రాల  మెరుపులు,
నీ నేత్రాల  ఆనంద భాష్పాలై, 
సంతోషాలు  కురిపించగా,
నను మురిపించి,
నను నడిపించి, 
నా ఆశల పల్లకీ  బోయీ వై ,  
నా ప్రగతికి  మార్గదర్శకుడివై, 
హితుడివై, 
స్నేహితుడివై , 
నా జీవితానికి దేవుడిచ్చిన  వరమై,  
వేయి వసంతాల  వెన్నెల చల్లదనంలో, 
శతకోటి  మల్లెల  పరిమళాల  మనసుతో, 
నువ్వే  కావాలి  ప్రతి జన్మలో మా  నాన్నగా. 

No comments:

Post a Comment