Wednesday, September 20, 2017

ఒంటరి

చుట్టూ పదిమందున్నా
నీతో కబుర్లు చెప్పే వారు లేకపోతె
తెలుసుకో నేస్తం నువ్వు ఒంటరివే అని

మనసుకి కష్టం వస్తే
పంచుకోటానికి పక్కన ఎవరూ లేనప్పుడు
ఉన్నా, నీ బాధ పంచుకోలేనప్పుడు
నువ్వు ఒంటరివే నేస్తం

అమ్మా నాన్నా
అక్కా చెల్లి
నీ జీవితాంతం నీ తోడు ఉండలేకపోవచ్చు
కానీ, నిన్ను ప్రేమించేవారు నీకు తోడు లేకపోతె
నువ్వు ఒంటరివేరా నేస్తం

స్నేహమైనా ప్రేమైనా
ఇరువురిలోను ఉంటేనే అది గెలుస్తుందిరా
రెండు చేతులు జోడిస్తేనే చప్పట్లు
రెండు మనసులు దగ్గరైతేనే బంధం
ఆ స్నేహం, ప్రేమ, ఉంటేనే
మనిషి సంతోషంగా ఉండగలడు
ఏ కష్ట నష్టాలనైనా ఎదిరించగలడు 
నేనంటే నేనేనా
కాదేమో, నేను అన్నా అది నిన్నేనా?
నేనంటూ లేనా?
కాదేమో, నీలోనే నే ఉన్నాగా.
ప్రాణం నాది
కానీ అది నిలబెట్టే ఊపిరి నీది
నీవంటూ దూరమయితే
నేనంటూ లేనట్లే
ఈ ప్రాణానికి ఊపిరి లేనట్లే

Friday, November 20, 2015

ప్రకృతి రమణీయం

శుభోదయం 
ప్రభాత భానుడి  అరుణోదయం.
నవ జీవన  వేదానికి  ప్రభోదయం,
కోయిల  కుహు కుహు లు  ,
పక్షుల  కిలకిలలు,
హిమ బిందువుల తళ తళలు ,
నయనాలంకృత    దృశ్య పధ కేళికి 
 ప్రకృతి 
 పురి విప్పిన మయూరమై నర్తించగా ,
సుస్వర గీతికలై  , 
నీలాల  గగనాల  ఆ  మేఘమాల  ,
కురిపించిన   చిరు  జల్లులు  
హరివిల్లై  గగనాన , 
ఇల చేరుతూ   
ఘల్లు  ఘల్లు మని 
పుడమిని తాకగ ,
విస్ఫులించిన  పుడమి  పరాగ  పరిమళాలు
మైమరపించగా , 
చిటపట  చినుకు ల  తొలకరి లో  ,
చిరు  చిరు చిగురులు చిగురించగా  ,
చిరు చిరు నగవుల  సొగసులతో  ,
అరకొర  విరిసిన  నవ్వులతో ,  
విరబూసిన  కుసుమాలు
సుమధుర  సుగంధ
పరిమళాలు వెదజల్లగ 
చల్లగా వీచే పవనాల మృదు  మధుర  స్పర్స  ,
సుస్వర  గీతికలై  
వీనుల తాకగా,  
ఉప్పొంగిన  తరంగమై 
ఎగసిన మనసే  
జన పదాలు ఆల పించగా  
కరాలు కలిపి  ,  
హలాలు  పట్టి  
పొలాలు దున్ని , 
చిందిస్తూ  స్వేదం ,  
చేస్తున్న సేద్యం  , 
మన  దేశపు సౌభాగ్యం,
పవనాల జోరుకు  తల లూపుతూ
పచ్చని  పసిడి కంకు 
పైరుల మిలమిలలు ,
ఈదురు  గాలుల మురళి రవాలు,
మైమరపిస్తుంటే ,
మలి  సంధ్య వేళ     
గోవుల  ' పధ '  ధూళి 
నింగి  కెగసిన తరుణం  లో ,
గగనపు వీధులన్నీ  
సింధూరము  దిద్దు కుంటున్న  వేళ
సిగ్గుతో  ఎరుపెక్కిన , 
నిచ్చెలి చెక్కిలి లా,
అరుణ వర్ణము 
దాల్చిన దిఙ్మండలము,
చక్కని  ' రిక్క ' ల మల్లెలు  
సిగలో  ధరించి న    
గగనము 
కాటుక నింపిన  భరిణై,
నల్లని కురులు విరబోసినట్లు , 
చీకట్లు  పరుచుకుంటున్న  వేళ
 వెన్నెల వెండి  వెలుగులు 
పరుచుకుంటున్న  వేళ,
మిలమిల మెరుపుల , 
చిలిబిలి తళుకుల , 
చిరు చిరు   నగవుల కెరటాలతో ,
వయ్యారి గోదారి ,
ఆ  కిన్నెరసాని
సొగసుల హోయలు,
కనువిందు  చేస్తుంటే  యేమని  వర్ణించాలి
ప్రకృతి రమణీయం. 
-----కృష్ణ  

Wednesday, November 18, 2015

నాన్నా

నాన్నా
 నా దరహాసమే  నీ ఉల్లాసమై  ,
నా నవ్వులే  నీ  దరహాసమై  ,
నా  అల్లరే  నీ ఆనందమై,
అడుగు  నాదై (నా)  ఆత్రుత  నీదై ,
నీ అడుగులో నా అడుగు వేసి,
నా విజయ విజయం లో తొలి అడుగు నీవై, 
నువ్వోడి  నను గెలిపించి  ,
నా విజయ నేత్రాల  మెరుపులు,
నీ నేత్రాల  ఆనంద భాష్పాలై, 
సంతోషాలు  కురిపించగా,
నను మురిపించి,
నను నడిపించి, 
నా ఆశల పల్లకీ  బోయీ వై ,  
నా ప్రగతికి  మార్గదర్శకుడివై, 
హితుడివై, 
స్నేహితుడివై , 
నా జీవితానికి దేవుడిచ్చిన  వరమై,  
వేయి వసంతాల  వెన్నెల చల్లదనంలో, 
శతకోటి  మల్లెల  పరిమళాల  మనసుతో, 
నువ్వే  కావాలి  ప్రతి జన్మలో మా  నాన్నగా. 

Tuesday, November 17, 2015

KOLAVENNU RAMA KOTESWARA RAO

 KOLAVENNU RAMA KOTESWARA RAO
                                                 gem of an aesthete
                                    

Indeed, Kolavennu was a many – splendored personality.
But his monumental memorial is his Quarterly Triveni. He was its Founder-editor. 
Kolavennu was born on 22nd October 1894 in Narasaraopet in Guntur District, A.P.

He had his brilliant  academic career in Guntur, Machilipatnam in Madras. 
He practiced as a lawyer for three years. But profession did not suit his literary and artistic  temperament . 

As a patriot plunged into the freedom movement and courted imprisonment. For some time he was teacher , vice principal later principal at the A.J.Kalasala.Machilipatnam. 

Latter  he started his journalistic career with Prakasan's Swarajya and then he worked with Katuri as joint -Editor- of  "Krishna patrika".

He sponsored Triveni through a saga of struggle suffering and sacrifice . Triveni has been a high class literary cultural and historical periodical . 

He was famous for his brilliant editorials.  Kolavennu had the unique honor to be remember of composite madras Legislative Assembly, Andhra Sahithya Academy, Central Sahithya Academy, and All India Radio.
He was a brilliant scholar, speaker and writer in Telugu and English.
He won great name and fame.








---------By: Tatavarty Siva Rama Krishna

Thursday, November 12, 2015

అంతర్యామి

మన  కష్టాలకు పరిస్థితులని నిందించడము, సాకులు వెదకడమే, పరిష్కారము కాదు. ఏ సమస్య ఎదురైనా అందులో మన బాధ్యత ఎంతుందో గుర్తించినప్పుడే దాని లోని లోపాలను సవరించుకుని, సమర్ధ్యంగా మలుచుకుకొగలుగుతాము.
ఇతరులలో నువ్వు మంచి వెతికితే మంచి కనిపిస్తుంది. చెడు వెతికితే చెడు కనిపిస్తుంది. మనకు ఇష్టమైన వాళ్ళలో మంచి, నచ్చక పొతే చెడు కనిపిస్తాయి. మనం మంచిగా నడిచి పది మందిని మారుద్దాము.

గాలి. నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనేవి పంచ భూతాలు. ఇవి లేనిదే మనిషి జన్మే లేదు. ప్రతి మనిషి లోను రాక్షసుడు, దేవుడు ఉంటారు (మంచి, చెడ్డ).
దేవుడిని అణగ తొక్కి, రాక్షసుడిని నిద్ర లేపితే వినాశనం. రాక్షసుడిని అణగ  తొక్కి దేవుడిని నిద్ర లేపితే విశ్వ శాంతి. 

మహాత్ముడివి కానక్కరలేదు మనిషి గా బతికితే, దేవుని దయకు పాత్రులౌతారు. దేవుని చుట్టూ మనం తిరగడము కాదు మంచి పనులు చేసి మన చుట్టూ దేవుడిని తిప్పుకోవాలి, జన్మ సార్ధకం చేసుకోవాలి.

అందరిలోనూ దేవుడిని చూడు అదే తపస్సు, అదే ఆనందం, అదే ఆరోగ్యం.
హాయిగా బతకండి.

శాంతి, శాంతి, శాంతి 

------ఆచంట సుబ్బ లక్ష్మి 

Saturday, October 31, 2015

మహా కవి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

నంది వర్ధనాల  పట్టు కొమ్మ  మన  మహా కవి శ్రీ  సిరివెన్నెల  సీతారామ శాస్త్రి గారు. సినీ నేపధ్యగీతాలలో  తనదంటూ ప్రత్యేక శైలిని , స్థాయిని ఏర్పరుచుకుని  తెలుగు వారు గర్వించదగ్గ ప్రపంచ స్థాయి మహా  కవిగా  సుస్థిర  స్థాన్నాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ మహానుభావుడి గురించి కొన్నివిషయాలు ప్రస్తుతించడము  అదృష్టము గా భావిస్తూ ....

                        విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం - ఓం
                       ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవ నాదం- ఓం
                           కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
                           ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
                           సరసుస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది 
                                         నే పాడిన జీవన గీతం ఈ గీతం
                                        విరించినై విరచించితిని ఈ కవనం
                                          విపంచినై వినిపించితిని ఈ గీతం .....

బ్రహ్మ యొక్క ఆలోచనలలో  యెప్పుడో పుట్టిన సృష్టి కి మూలవేదం "ఓం ",  అంటూ ఓంకారం  చుట్టి ,
నా ఉచ్వాసము  కవిత్యము , నా నిశ్వాసము పాట గా  సినీ గేయ రచయిత గా , సాహితీ చరిత్రలో తనదంటూ  ఓ బంగారు పేజి ని సృష్టించుకున్న, శ్రీ  సిరివెన్నెల  సీతారామశాస్త్రి గారికి                   పాదాభి వందనాలు చేస్తూ  .....   శుభోదయం  , 
                                            కళాభ్యుదయ  వాది కి అరుణోదయం,
                                           ప్రభవించిన  చాతుర్యానికి  ప్రభోదయం ,
                                           కలం పట్టి , పదాలు దున్ని, మీరు చేస్తున్న పదకవితా సేద్యము,
                                           కలలు కదిపి, కలం కదిపి , గీతాల నిండా  పదాలు నింపి ,
                                          సుస్వర , సుశబ్ద పదాల మాల నూర్చి , 
                                          మీరు చేస్తున్న  సాహితీ సాగర మధనం ,
                                         మధురామృత కావ్య  జననం  ....
ఆది భిక్షువు వాడినేది కోరేది 
బూడిదిచ్చేవాడినేది అడిగేది 
ఏది కోరేది వాడినేది అడిగేది 
ఏది కోరేది వాడినేది అడిగేది   
                             అంటూనే తొలి  "నంది " ని తెచ్చి  ఇంట్లో పెట్టేసుకున్నారు. 

మూడు వేలకు పైగా పాటలు , పది  నంది అవార్డు లు,  మూడు  ఫిలిం ఫేర్  అవార్డు లు .
అత్యంత  అద్భుతము గా రాయడమే కాకుండా , అత్యధిక  పారితోషిక  గౌరవాన్ని 
దక్కించుకున్న ఘనత కూడా శాస్త్రి గారిదే. గర్వించ దగ్గ  రచయితలలో  " శ్రీ వేటూరి "  గారు  , "శ్రీ ఆత్రేయ " గారి తో సమానము గా రాయగల సామర్థ్యము గలవారని  అభివర్ణిస్తూ  ఉంటారు. 
వర్ధమాన  రచయితలు  చంద్రబోస్  , అనంత శ్రీరాం  ,రామజోగయ్య శాస్త్రి గార్లు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి  గారిని  గురువుగా భావించి గౌరవించుకుంటూ ఉంటారు. 

తెలుగు సాహిత్య రంగము లో సిరివెన్నెల గారు చేస్తున్న కృషి ఎనలేనిది. ఆయన  రచనలలో ఎక్కడా   ద్వందార్ధాలు కనపడవు. అశ్లీలత ఆమడదూరం లో ఉంటుంది. తెలుగు భాష ఔన్నత్యాన్ని, విలువలను, మన సంస్క్రుతి సాంప్రదాయాలను, స్థాయిని, ప్రతిబింబింప చేసేవిగా ఉంటాయి.  

ప్రముఖ  దర్శకులు శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్ గారి మాటల్లో  :

"శాస్త్రి గారు  పాట  రాస్తే  నిఘంటువు  దగ్గరకు  పరిగెత్తాలి"  అంటారు        

ప్రాగ్దిశ వీనియపైన దినకర మయూఖతంతృల పైన 
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా ....

ఆ పాట విన్నంతనే "తెలుగు dictionary" ఒకటుంటుంది   అని  దాని  పేరు  "శబ్ద రత్నాకరము " అని తెలుసుకున్నాను అంటారు. ఒక పాటను అర్థము అయ్యేలా మాత్రమె  కాదు అర్థము చేసుకోవాలి అనే కోరికను పుట్టించేదిగా కూడా   రాయచ్చు అని, తెలుగు పాట  స్థాయిని పెంచిన వ్యక్తి  శ్రీ సీతారామ శాస్త్రి గారు అని  కొనియాడతారు.

రాత్రిళ్ళు  టేబుల్ మిద ఆయన  ఖర్చు చేసిన క్షణాలు,  ఆయన ఖర్చు చేసిన జీవితం, 
ప్రపంచం అంతా పడుకున్న తరువాత ఆయన నిద్రలేస్తాడు , అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.
ఆయన పదాలు అనే కిరణాలు  తీసుకుని అక్షారాలు అనే తూటాలతో ప్రపంచం మీదకు వేటకు
బయలు దేరుతాడు. రండి, నాకు సమాధానం చెప్పండి, మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలని మన మీదకు   సంధిస్తాడు. మన  ఇంట్లోకి  వస్తాడు,  మన  ప్రక్కనే  నిలుచుంటాడు,  ఎప్పుడు  ఒప్పుకోవద్దు "ఓటమి"  ని అంటాడు. వచన  కవిత్వానికి  నోబుల్  స్థాయిలో  రాయగల  సామర్థ్యం  ఉన్న  కవి అంటారు శ్రీ  త్రివిక్రమ్  శ్రీనివాస్.
వాడుక  భాషలో  ,  ఆధునిక  పాశ్చాత్య   పోకడలతో  ప్రస్తుత పరిస్థితులలో గీతాలకు  వ్యాపార పరము గా ప్రాధాన్యము ఉన్నా, తెలుగు భాష గొప్పదనము  తెలుగు వారి , సంస్క్రుతి  సాంప్రదాయాలు  , సాహిత్య విలువలు కాపాడు కుంటూ వస్తున్న మార్గ దర్శకులు శ్రీ సీతారామ శాస్త్రి గారు.అంతే కాదు అవసరము అనుకుంటే  ఆ పాట ను రాసే అవకాశాన్ని వదులుకుంటాను కానీ ,అలంటి పాటలు రాయను  అని చెప్పేస్తారు. అంతటిసామర్థ్యము ఉన్న  రచయిత.

ఆయన పాటలలో పద  సామర్థ్యము  మాత్రమే కాదు , పలు  సామాజిక  అంశాలను కూడా, సున్నితముగా సృసిస్తూ ఉంటారు. ఒక్కో సారి కవితా వెశము లో 

 " నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
 అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
 మారదు లోకం మారదు కాలం
 దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
 మారదు లోకం మారదు కాలం "

"అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా  "

...అంటూ నిష్కర్ష గా విరుచుకు పడతారు . ఆయన రాసే ప్రతి పాట మార్గ దర్శకమె  ,
ప్రతి మాట అముల్య మైనదే .

రుద్రవీణ అనే చిత్రము లో  ఆయన రాసిన ఒకపాట  గురించి  విష్లెసిస్తూ, అడవి గాచిన వెన్నెల అనే పదాన్ని చాలాసార్లు వింటాము గాని వెన్నెలవృధా కావడము ఏమిటి, నాకు నచ్చ  లేదు, అందుకే   
"తరలి రాదా తనే వసంతము  తన దరికి రాని  వనాలకోసము " అంటూ 
"వెన్నెల దీపముకొందరిదా , అడవికి సైతము వెలుగు కదా" అంటూ   న్యాయము  చేసాను అంటారు.  
అంతే కాకుండా ఈ చిత్రము సామాజిక ఇతివృత్తము తో కూడినది .హీరో తండ్రి సంగీత 
విద్వాంసుడు ,ఆయన పాటలు హరిజనులు కోసము పాడడము ఇష్టము ఉండదు. కానీ ఆయన కుమారుడికి ఇది ఇష్టము ఉండదు. అందరు సమానమే, మీ సంగీతము పండితులకు, పామరులకు కూడా ఒకే   విధమైన  ఆనందాన్ని  ఇస్తుంది  అని  వాదిస్తూ  ఉంటాడు. ఆ భావాన్ని అంతర్లీనంగా వచ్చే విధము గా  "వెన్నెల దీపం  కొందరిదా, అడవికి  సైతము వెలుగుకద", రాసారు. విశిష్టమైన  illustrated  రచనా శైలి లో  అందే వేసిన చేయి  మన  సీతారామ శాస్త్రి గారిది. 


నంది అవార్డుల వివరాలు  :
1986      సిరివెన్నెల       " విధాత తలపుల "
1987      శృతిలయలు     " తెలవారదేమో స్వామి "
1988     స్వర్ణ కమలం    " అందేలా రవమిది "
1993      గాయం             "సురాజ్యమనలేని "
1994       శుభలగ్నం       " చిలకా ఆ తోడులేక " 
1996       శ్రీకారం            " మనసు కాస్త "
1997       సింధూరం         " అర్థ శతాబ్దపు  "
1999       ప్రేమకథ.          " దేముడు కరుణించాడని  " 
2005        చక్రం.             " జగమంత కుటుంబం నాదీ "
2008        గమ్యం.           "ఎంత వరకో"

--------కృష్ణ