సౌర్య కీర్తి --- జాతి స్ఫూర్తిమీ బుల్లెట్ల వర్షం తొలకరి జల్లు లా ప్రారంభమై ,పెను తుఫాను లా మారి ,ప్రళయ మారుతము గాసరిహద్దు శత్రువులనుచుట్టు ముట్టి,తరిమి కొట్టి,భారతీయులపై కురిపించాయివిజయ మల్లెల వర్షం.పెల్లుబికింది మీ పట్ల అంతటా హర్షం .వర్షం వెలిసిన తరువాత వీచేఈదురు గాలులలో ఎగురుతోందిఎగురుతోంది మువన్నెల జెండా,అనంతమైన ఎత్తులోఅశేష హిమాలయా పర్వతాల మీదమ్రోగిస్తూ విజయ దుందుభి,శిఖరాగ్రము ఫై తల ఎత్తి సగర్వం గా,మిల, మిలా మెరుస్తూ ,అందరు యోధుల విజయానికి సంకేతము లా ,మరెందరో యోధుల త్యాగానికి ఫలితం లా ,దేశ మంతటా విజయోత్సావాలు వెల్లి విరుస్తుంటే ,తల్లీ భారతిఏమిటమ్మా నీ కళ్ళలో నీళ్ళకు అర్థం మన వీర సైనికుల సౌర్యము అనిర్వచనియము. ,పరాక్రమము అత్యద్భుతం ,త్యాగం చిర స్మరణియమ్ ,శత్రువులను తరిమి కొట్టి మన జాతి గౌరవాన్ని ,మన దేశ ప్రతిష్టను కాపాడినఇలాంటి వీరులను కన్నందుకుకళ్లలొ కలిగిన ఆనంద భాష్పాలా,లేకవీర పరాక్రమము తో యుద్ధము లోదేశ రక్షణ కై ,అశువులు బాసినవీర యోధుల త్యాగానికి అశ్రు తర్పణమా ......మన దేశ రక్షణ కై పోరాడే ప్రతీ వీరునికివినమ్రము గా వందనము చేస్తూఈ కవితను అంకితమిస్తున్నా
Friday, October 9, 2015
వీర సైనికా వందనం
Subscribe to:
Post Comments (Atom)
Nice
ReplyDelete